బీజేపీ స్కెచ్‌ : ప‌వ‌న్‌- జ‌గ‌న్ మిలాఖ‌త్‌?

Wednesday, November 7th, 2018, 12:34:31 PM IST

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో దేశ రాజ‌కీయాల‌తో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయం రంగుమారుతోంది. స‌రికొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్, టీడీపీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇలాంటి చిత్ర‌మైన పొత్తే ఏపీలోనూ పొడ‌వ‌బోతోందనే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దానికి బ‌లాన్ని చేకూరుస్తూ ఏపీ టీడీపీ నేత‌లు చేసిన‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయ నేత‌ల‌ను షాక్‌కు గురిచేస్తున్నాయి.

గ‌త కొంత కాలంగా జ‌న‌సేన అధినేత ప్ర‌సంగానే జ‌గ‌న్‌ని విమ‌ర్శించ‌డం త‌గ్గింద‌ని, రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి జ‌గ‌న్ ఏపీలో పోటీకి దిగే అవ‌కాశాలే ఎక్కువ‌గా కనిపిస్తున్నాయ‌ని, వారిద్ద‌రు క‌ల‌వ‌డానికి బీజేపీ పెద్ద మంత్రాంగాన్ని న‌డిపే అవ‌కాశం లేక‌పోలేద‌ని టీడీపీ నేత‌ల తాజా వాద‌న‌. ఈ వార్త‌ల నేప‌థ్యంలో ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఏక‌మ‌వుతారా? అన్న‌ది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ‌లో కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ప‌ర‌మావ‌దిగా కాంగ్రెస్‌తో క‌లిసి టీడీపీ మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. దీనిపై తెరాస శ్రేణులు ఇది అప‌విత్ర పొత్తంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇదే ప‌రిస్థితి త‌మ‌కూ రాకూడ‌దంటే ముందే జ‌న‌సేన‌, వైసీపీ క‌ల‌వ‌కుండా చేయాల‌ని టీడీపీ అప్పుడే జాగ్ర‌త్త ప‌డ‌టం మొద‌లుపెట్టింది. అందులో భాగంగానే జ‌న‌సేన‌, వైసీపీపై విమ‌ర్శ‌ల‌కు దిగుతోంది. పొత్తుల‌కు ఆస్కారం లేదంటున్న జ‌న‌సేన త‌రువాత‌ టీడీపీ అనుమానిస్తున్నట్టుగానే బీజేపీ మ‌ధ్య వ‌ర్తిగా మారితే వైసీపీతో జ‌ట్టు క‌డుతుందా? లేదా అనేది కాల‌మే నిర్ణ‌యించాలి.