తెలుగు రాజకీయాల భవిష్యత్తు! పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ తో సాధ్యం!

Monday, September 25th, 2017, 07:40:31 AM IST


జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు నాట స్టార్ హీరోలు, తాజాగా జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ తన చరిస్మా ఏంటో మరో సారి అందరికి పరిచయం చేసాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కేవలం తన చరిస్మాతోని సినిమాతో సంబంధం లేకుండా నిర్మాతలకి లాభాలు తెచ్చిపెడతాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సినిమాతో సంబంధం నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టే స్టామినా ఉందని జై లవకుశతో నిరూపించుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడుగా ప్రతి ఒక్కరు గుర్తించే స్థాయిలో ఉన్నాడు. నటుడుగా పవన్ కళ్యాణ్ అంతగా గుర్తింపు తెచ్చుకోకపోయిన ఆయన చరిస్మాతో సౌత్ ఇండియాలో రజినీకాంత్ తర్వాత తానే అని నిరూపించుకున్న వ్యక్తి. అయితే ఈ స్థానం ఇద్దరికి ఏదో ఒక్క సినిమాతో వచ్చింది కాదు. ఇద్దరికి వెనుక పెద్ద ఫామిలీస్ ఉన్నాయి. అయితే వారికంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకోవడం ఈ ఇద్దరి మార్గాలు చాలా దగ్గరగా ఉంటాయి. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి, స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి వ్యక్తిగతంగా వారిని వారు తీర్చిదిద్దుకున్నారు . ఆ వ్యక్తిత్వంతో, వారి ఆలోచన, మాటతీరుతో కోట్లలో అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని శాశించే స్థాయికి ఎదిగారు.

అయితే వారి స్టార్ ఇమేజ్ అంతా సినిమా ద్వారా తెచ్చుకున్నది. అంత వరకు వారి ఫ్యాన్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు గర్వపడాల్సిన విషయమే. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల గురించి మాటలు వచ్చినప్పుడు అందరు చెప్పే మాట పవన్ కళ్యాణ్, తారక్. ఇద్దరికి భవిష్యత్తులో తెలుగు ప్రజలకి నాయకులుగా ఉండే లక్షణాలు ఉన్నాయని అందరు అనే మాట. జూనియర్ ఎన్టీఆర్ తాత నాయకత్వ లక్షణాలని కూడా పునికిపుచ్చుకున్నాడని, అతనికి ప్రజల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉందని, కచ్చితంగా రేపటి టీడీపీ భవిష్యత్తు ఎన్టీఆర్ తోనే సాధ్యం అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటె ప్రజల భవిష్యత్తు భాగుంటుంది అనేది చాలా మంది మాట. అతనికి కష్టం విలువ తెలుసనీ, ప్రజల సమస్యల మీద స్పందించే గుణం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో వినిపిస్తున్న మాట.

ఇక పవన్ కళ్యాణ్ కి అన్న పెట్టిన రాజకీయ పార్టీతో వచ్చిన అపవాదు వెనక ఉన్న, మరల కొత్త పార్టీతో రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టి తనదైన శైలిలో ప్రజల సమస్యల మీద స్పందిస్తూ రాజకీయాల్లో ముందుకి వెళ్తున్నాడు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం చూపించే నాయకుడు అవుతాడని, ప్రజా సమస్యల మీద అతను స్పందించే విధానం. సమస్యని క్షుణ్ణంగా పరిశోధించే దానిపై మాట్లాడుతూ, ఆ సమస్య మీద అందరు ద్రుష్టి పెట్టేలా చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా ఉన్నాడని మాట వినిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది పవన్ వ్యక్తిత్వం రాజకీయాలకి కరెక్ట్ గా సరిపోతుందని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని, అతనితో ఎంతో కొంత మార్పుని రాజకీయాల్లో చూడొచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది తెలుగు నాట పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పార్టీల పరంగా కాకున్నా, ఒకే ఆలోచనతో ఉన్న నాయకులు కాబట్టి వారు రాజకీయాల్లో ఉంటే ఏపీ దేశంలో రాజకేయాలని శాశించే రాష్ట్రం అవుతుందని, అలాగే మిగిలిన రాష్ట్రాలకి కూడా ఏపీ ఆదర్శం అవుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం మీద ఆధారపడి ఉంటుంది.

Comments