వీడియో : బస్సు యాత్ర లేదా పాదయాత్ర.. అక్కడే నిర్ణయిస్తానన్న పవన్..!

Sunday, January 21st, 2018, 01:47:48 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాల వేగం పెంచారు. జనసేన పార్టీ కార్యాలయంలో పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురకోవస్కీతో సమావేశం అయన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడారు. ఈ సంద్భర్భంగా పవన్ కళ్యాణ్ తన ప్రజాయాత్ర గురించి వివరించారు. మొదట తెలంగాణలోని మూడు జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. తాను పాదయాత్ర చేస్తానా లేక బస్సు యాత్ర చేస్తానని లేకుంటే ఇంకేదైనా రూపంలో యాత్ర ఉంటుందా అనే విషయాన్ని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రకటించనున్నట్లు తెలిపారు.

తాను ప్రజారాజ్యం పార్టీ సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నానని, అందువల్లనే విద్యుత్ ఘాతం జరిగినప్పుడు పెను ప్రమాదం నుంచి బయట పడ్డానని తెలిపారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక మరోమారు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటానని పవన్ కళ్యాణ్ గతంలో మొక్కుకున్నట్లు వివరించారు.

కాగా పవన్ కళ్యాణ్ నుంచి ప్రకటన వెలువడడంతో కొండగుట్టలో ఆయన అభిమానుల సందడి మొదలైపోయింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పవన్ ప్రజా యాత్ర విజయవంతం కావాలని పూజలు నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం కొండగట్టులో ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. పరిస్థితులకు అనుగుణంగానే యాత్ర ఏరూపంలో ఉంటుందో నిర్ణయిస్తామని పవన్ తెలిపారు.