అద్వానీ ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిన పవన్ కళ్యాణ్ !

Monday, January 22nd, 2018, 10:24:22 PM IST

జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా తెలంగాణ యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు తావు ఇచ్చింది. రాజకీయ విలేశ్లేషకులు వివిధ రకాలు పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రని విలేషిస్తూ భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలపై అంచనాలు కడుతున్నారు. మీడియాలో కూడా పవన్ ప్రజా యాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ టివి చర్చ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి అధికార ప్రతినిధి రఘురాం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బిజెపి విజయం సాధించిన తరువాత తాను అద్వానీగారిచే పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడించానని రఘురాం అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అద్వానీ ఆ సమయంలో ఓ సలహా ఇచ్చారు. నీ సభకు వచ్చే జనం మొత్తం నీకు ఓటు వేయరు. ఈ విషయం గ్రహిస్తే రాజకీయాల్లో విజయం సాధించినట్లే అని అద్వానీ పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారట. గతంలో చిరంజీవి చేసిన తప్పిందం కూడా ఇదే అని రఘురాం అన్నారు. తాజా పరిస్థితిని గమనిస్తే పవన్ కళ్యాణ్ స్లో అండ్ స్టడీ గా వెళుతూ అద్వానీ సలహాని పాటిస్తున్నారని అన్నారు. తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండక పోవచ్చని, కానీ ఏపీలో మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ ప్రభావం చూపుతారని అన్నారు.