ఎలక్షన్ 2019: తెలంగాణాలో పోటీపై క్లారిటీ ఇచ్చిన పవన్..!

Thursday, March 14th, 2019, 07:26:14 PM IST

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది, పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు మదలెట్టాయి. జనసేన తొలి జాబితా ఇప్పటికే ప్రకటించగా టీడీపీ, వైసీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే దిశగా జనసేన వేగంగా అడుగులేస్తోంది, అయితే తెలంగాణాలో మాత్రం పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడలేదనే చెప్పాలి. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగలేదు, ముందస్తు ఎన్నికలు రావటం వల్ల సిద్దపడలేకపోయామని లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుత పరిస్థితి చుస్తే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసే అవకాశం దాదాపు లేనట్లే అనిపిస్తుంది.

రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణాలో జనసేన పోటీ చేయలేదు కానీ, తెలంగాణ యువత మార్పు కోరుకున్న రోజున తప్పకుండా పోటీ చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చుస్తే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోదని స్పష్టం అవుతుంది. తెలనగానలో పోటీ చేయకపోవడానికి క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ బలంగా లేకపోవటమేనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.