ఆ సినిమా అంటే నాకు ఇష్టం: పవన్ కళ్యాణ్

Thursday, May 10th, 2018, 11:39:49 PM IST


టాలీవుడ్ లో ఈ రోజు ఒకేసారి రెండు వేడుకలు జరిగాయి. నా పేరు సూర్య థ్యాంక్యూ మీట్ తో పాటు నేల టిక్కెట్టు సినిమా ఆడియో ఈవెంట్ కూడా ఒకేసారి జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే రెండు వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రావడం స్పెషల్. ఇకపోతే నా పేరు సూర్య థ్యాంక్యూ మీట్ లో పవన్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. ఇక త్వరలో ఏపిలో తన రాజకీయ పర్యటనను మొదలు పెట్టె ముందు సినిమా చూడాలని అనుకుంటున్నట్లు పవన్ తెలిపాడు.

పవన్ మాట్లాడుతూ.. ‘నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు .. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ‘నా పేరు సూర్య’ సినిమా ట్రైలర్ చూడగానే సినిమా చూడాలని అనిపించింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో కొత్త దర్శకుడు వక్కంతం వంశీ పెద్ద సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు. సమ్మర్ లో ఒక మంచి సినిమా వచ్చినందుకు హ్యాపీగా ఉంది. బన్నీ సినిమాలో తనకు ఆర్య సినిమా అంటే చాలా ఇష్టమని భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు చేయాలనీ గొప్ప విజయాలను అందుకోవాలని చెబుతూ.. అల్లు అర్జున్ తన తల్లిదండ్రులకు తాతయ్యకు కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ తెలియజేశారు.