పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మీరు నాపై దాడి చేస్తే స్పందించరా?

Sunday, September 30th, 2018, 03:03:40 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏలూరులో తన ప్రజా పోరాట యాత్రని కొనసాగిస్తున్న సంగతి తెలిసినదే అయితే అదే సందర్భంలో చింతమనేని మీద చేసిన వ్యాఖ్యలకు గాను,తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తల్లో కొన్ని అలజడులు కూడా మొదలయ్యాయి.దీనితో ఇరు వర్గాల్లో ఘర్షణలు మొదలయ్యి అవి పవన్ కళ్యాణ్ మీదకు దాడి చేసేంత వరకు కూడా వెళ్లాయి.దీనిపై పవన్ ఈ రోజు చింతలపూడిలో జరిగినటువంటి సభలో స్పందించారు.

తెలుగుదేశం పార్టీకి వ్యతిరేఖంగా ఉన్నారని చెప్పి జనసేన కార్యకర్తల మీదాను,యువత మీద దాడి చేస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పుడేమో టీడీపీ వారు నన్ను ఉద్దేశించి నిన్న కాక మొన్న వచ్చిన నువ్వెవరు అడగడానికి అంటే అలాంటప్పుడు నా ఇంటికి వచ్చి మరీ ఎందుకు నా మద్దతు కావాలని కోరారని ప్రశ్నించారు.నా పుట్టిన రోజుకి చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి లోకేష్ గారు శుభాకాంక్షలు తెలిపారు కానీ నిన్న నాపై జరిగిన దాడిపై మాత్రం మీ ఇద్దరు ఎందుకు స్పందించడం లేదు అని,దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించారు.