జ‌గ‌న్..లోకేష్‌ల పై.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌లైన ర‌చ్చ‌..!

Tuesday, October 9th, 2018, 11:54:08 AM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యాన అధికార టీడీపీ., ప్ర‌తిప‌క్ష వైసీపీలు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సోమ‌వారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారస‌త్వ రాజ‌కీయాల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు.

అస‌లు విష‌యంలోకి వెళితే ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నారా చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌.. ఎటువంటి రాజకీయ అనుభ‌వం లేకుండా.. ఎలాంటి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పార్గొన కుండా ఏకంగా మంత్రి అయిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చి.. త‌న త‌న‌యుడుని ఎలాగైనా ముఖ్య‌మంత్రి చేయాల‌ని చంద్ర‌బాబు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక మ‌రోవైపు మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యుడు కూడా ఈసారి ఎలాగైనా ముఖ్య‌మంత్రి కావాల‌ని నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్య‌లో తాజాగా ప‌.గో.జీలోని కొయ్య‌ల‌గూడెంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. వార‌స‌త్వ రాజ‌కీయాలు స‌మ‌కాలీన రాజ‌కీయాల‌ను నాశ‌నం చేస్తున్నాయ‌ని.. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వార‌స‌త్వంగా వ‌చ్చేది కాద‌ని అన్నారు. తాత, తండ్రి ముఖ్య‌మంత్రి అయ్యారు కాబ‌ట్టి లోకేష్ కూడా సీయం అవ్వాలంటే కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్‌ను కూడా వ‌ద‌ల్లేదు ప‌వ‌న్. త‌న తండ్రి సీయం అయ్యాడు కాబ‌ట్టి తాను కూడా సీయం అవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ని.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంటే డ‌బ్బులు దోచుకోవ‌డం కాద‌ని.. అది ఒక రాష్ట్రంలోనే అత్యున్న‌త ప‌ద‌వి అని.. రాష్ట్రాన్నిఅభివృద్ది బాట‌లో న‌డిపేందుకు.. కీల‌క‌మైన‌ మార్పులు చేసే అత్యున్న‌త స్థానం అని సీయం ప‌ద‌వి వార‌స‌త్వం కాద‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.