నమ్మకం పోయింది.. అందుకే ఇలా చేస్తున్నాం : పవన్ కళ్యాణ్

Saturday, April 7th, 2018, 12:46:42 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడలో చేసిన పాదయాత్ర ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. అలాగే పవన్ పాదయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర లో పవన్ ఎక్కడా తగ్గకుండా దాదాపు 7 కిలో మీటర్ల వరకు నడిచారు. విజయవాడ బెంజి సర్కిల్‌ దగ్గర మొదలైన పాదయాత్ర రామవరప్పాడు వరకు కొనసాగింది. సీపీఐ – సిపిఎం కార్యకర్తలు పవన్ కు మద్దతు ఇచ్చారు.

ఇక పాదయాత్ర అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ – వైసిపి పార్టీల అసమర్థత గురించి ఆయన వివరించారు. పవన్ మాట్లాడుతూ.. ముందుగా ప్రత్యేక హోదా సంజీవని కాదన్నా చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా వద్దంటున్నారు. ప్రత్యేక హోదా పై స్పష్టత ఇవ్వడంలేదు. అసలు హోదా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పటి వరకు ఆ విషయం గురించి ఎలాంటి కార్యచరణని ప్రకటించలేదు. అఖిల పక్షం అని ఇప్పుడు చేస్తోన్న హడావుడి రెండేళ్ల కిందటే చేసి ఉంటే బావుండేది. ప్రతి పక్ష పార్టీ వైసిపి కూడా ప్రత్యేక హోదాపై పోరాటం చేయడం లేదు. కొన్ని ఒత్తిడిల వల్లే పోరాటానికి వారు దూరంగా ఉన్నారని చెప్పిన పవన్ అనాడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈనాడు బీజేపీ నెరవేర్చడం లేదని అన్నారు. అందుకే తాను మోడీ గురించి మాట్లాడుతున్నాని అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని, అందుకే వామపక్షాలతో పోరాడుతున్నట్లు వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments