పవన్ కళ్యాణ్ మరో సమస్యపై పోరాటానికి సిద్ధం! అదేంటంటే?

Monday, September 25th, 2017, 07:55:32 AM IST

వైజాగ్ రైల్వే జోన్… ఈ మాట ఏపీలో ఎన్నో ఏళ్ళుగా వినిపిస్తుంది. ఎంతో మంది రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు, పార్టీలు మారినపుడు ఈ వైజాగ్ రైల్వే జోన్ అంశం అన్ని పార్టీలు ప్రముఖంగా వినిపిస్తాయి. హామీలు కూడా ఇస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దాని గురించి ఒక్కరు మాట్లాడారు. పెద్దగా చర్చించరు. ఎవరైనా ఆందోళన చేస్తే మాత్రం దాని గురించి ఆలోచిస్తున్నాం. కచ్చితంగా ఎ ఒక్క అవకాశం ఉన్న వైజాగ్ రైల్వే జోన్ చేస్తాం అంటూ బీరాలు పలుకుతారు. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే ఒక్కసారి గతంలోకి వెళ్తే.

వాల్తేర్ కేంద్రం లో ఏపీలో రైల్వే జోన్ ఉందేది. అయితే ఉత్తరాంధ్రా ప్రాబల్యం అప్పట్లో ఎక్కువగా ఉండటం వలన వారి ఆధిపత్యం చూపించుకోవడానికి వాల్తేర్ జోన్ తీసేసి, భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసారు. దానిలో వాల్తేర్ జోన్ కలిసిపోయింది. అయితే దీనిపై అప్పట్లో ఏపీలో ఆందోళన వ్యక్తం చేసిన, ఇక్కడి ప్రజల వాణిని బలంగా వినిపించే నాయకులు లేకపోవడం వలన వారి ఆధిపత్యంతో ఆ ఆందోళన పైకి రాకుండా ఆపేశారు. అప్పటి నుంచి ఈ రైల్వే జోన్ అంశం ఏపీలో కొనసాగుతూనే ఉంది. రాజకీయాల్లో ఇదొక ప్రధాన అంశంగా ఉంటూనే ఉంది. ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హామీల్లో వైజాగ్ రైల్వే జోన్ గురించి ప్రస్తావిస్తారు. ఈ సారి ఎలాగైనా వైజాగ్ రైల్వే జోన్ చేస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హామీలు ఇచ్చేస్తాయి. గత ఎన్నికల్లో ప్రధాని మోడీ నేరుగా వైజాగ్ రైల్వే జోన్ గురించి హామీ ఇవ్వడం జరిగింది. తరువాత ఆ విషయం గురించి అసలు పట్టించుకోవడం మానేశారు. రైల్వే బడ్జెట్ వచ్చిన ప్రతిసారి ఈ జోన్ ప్రస్తావన వస్తుందేమో అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే రైల్వే జోన్ కాదు కదా, అదనంగా రైళ్ళు కూడా ఏపీకి కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది. అయితే దీనిపై రాష్ట్రంలో ఎ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. అందరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైజాగ్ రైల్వే జోన్ ఉపయోగించుకోవడం తప్ప, దానికోసం కేంద్రంతో గట్టిగా ఫైట్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఎవరైనా ఆందోళన చేస్తే తామేదో ఉద్ధరిస్తున్నట్లు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. దీంతో ఈ సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంది.

అయితే తాజాగా జనసేన అధినేత వైజాగ్ రైల్వే జోన్ గురించి ఓ సమావేశంలో ప్రస్తావించడం ఇప్పుడు ఈ విషయం మీద అందరి ద్రుష్టి పడింది. తెలుగు రాష్ట్రాలు రెండుగా వేరుపడిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు వైజాగ్ రైల్వే జోన్ చాలా అవసరం. ఎందుకంటే, వైజాగ్ రైల్వే జోన్ వస్తే వేల సంఖ్యలో స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే వైజాగ్ అభివృద్ధిలో అది పెద్ద భాగం అవుతుంది. రాష్ట్ర రెవెన్యూ కూడా పెరుగుతుంది. వైజాగ్ సిటీ ఏపీ ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి బాటలో నడుస్తుంది. అలాగే ఏపీలో ఉన్న పెద్ద సిటీ వైజాగ్. ఇలాంటి వేళ ఆంధ్రాకి రైల్వే జోన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ రైల్వే జోన్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ప్రజల మధ్యకి వస్తే అతనికి ఊహించని మద్దతు దొరుకుతుంది అనేది చాలా మంది మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యెక హోదాతో పాటు, వైజాగ్ రైల్వే జోన్ ప్రధాన ఎజెండాగా తీసుకొని 2019 ఎన్నికలకి సిద్ధమవుతున్నాడా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వచ్చింది. రైల్వే జోన్ గురించి ఆయన మాటల సందర్భంలో ప్రస్తావించిన దాని వెనుక ఆయన ఎన్నికల ప్లాన్ ఉందనే మాట రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిజంగా రైల్వే జోన్ అంశాన్ని జనసేన ప్రధాన ఎజెండాలో భాగం అయితే మాత్రం ఏక ఏపీలో అతన్ని నిలువరించడం మిగిలిన పార్టీలకి చాలా కష్టం అనే మాట కూడా వినిపిస్తుంది. మరి రైల్వే జోన్ మీద పవన్ కళ్యాణ్ పోరాటం ఉంటుందా లేదా అనేది వచ్చే నెల వరకు ఎదురుచూస్తే తెలిసిపోతుంది.

Comments