జగన్ కు కౌంటర్ ఇచ్చిన పవన్

Wednesday, July 25th, 2018, 03:55:21 PM IST

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబుపైనే విమర్శలు చేయడం చూశాం. అలాగే అప్పుడపుడు బిజెపిపై కామెంట్స్ చేయడం గురించి కూడా అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జగన్ అందరిపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పై ఇంతవరకు పెద్దగా విమర్శలు చేయని జగన్ మొదటి సారి ఊహించని విధంగా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశారు.

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి నీతులు చెబుతున్నాడని సెటైర్ వేయడం వైరల్ అయ్యింది. అయితే ఈ కామెంట్స్ కు జనసేన అభిమానుల నుంచి మరో విధంగా ఆన్సర్ అందుతోంది. ఇక అసలు విషయంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు డిఫెరెంట్ స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. రీసెంట్ గా భీమ‌వ‌రం స‌మీపంలో ఉన్న నిర్మలాదేవి ఫంక్ష‌న్ హాల్ లో పలు సేవ కార్యక్రమాలు చేస్తున్న జన సైనికులతో ‘న‌వ‌యుగ జ‌న‌సేన’ పేరు పై ఒక కార్యక్రమం జరిపారు.

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ కే అంతుంటే.. నిజాయతీ పరుడినైన నాకెంత ఉండాలని పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. మార్పుకోసం ప్రయత్నం చేస్తున్నందు వల్ల ఈ విమర్శలు చేస్తున్నారు. సామజిక మార్పు తీసుకురావడం నా ఆశయం. దాని కోసమే సినిమాలను ఎంచుకున్నాను. జనసేన ఆలోచన విధానం వల్లే ఉద్దానం ఉండవల్లి వంటి ప్రాంతాల సమస్యలు బయటకు వచ్చాయని చెప్పారు. ఉద్దానం సమస్యను బయటకు తీసుకువచ్చింది ఎవరో పెద్ద నాయకుడు కాదని మీ లాంటి ఒక సాధారణ జన సైనికుడిని పవన్ తన వివరణ ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments