జ‌న‌సేనాని మ‌రో ఉద్య‌మానికి తెర‌లేచిన‌ట్టే!

Thursday, January 19th, 2017, 08:15:21 PM IST

pk-pawan
ఎక్క‌డ ఉద్య‌మం అవ‌స‌రం అయితే అక్క‌డికి చెగువేరా త‌ర‌హాలో వాలిపోతున్నారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. అక్క‌డ స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌న‌సేనాని దూసుకుపోతున్న తీరుకు ఏపీ ప్ర‌భుత్వంలో రోజురోజుకి క‌ల‌వ‌రం పెరిగిపోతోంది. జ‌న‌సేనాని ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలా? అన్న ఆత్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ఉద్ధానం స‌మ‌స్య, చేనేత స‌మ‌స్య ఇలా ప్ర‌తిదాంట్లో ప‌వ‌న్ దూకుడు చూపిస్తుంటే, తేదేపా రియాక్ట‌యిన తీరు అలానే ఉంది.

తాజాగా పోల‌వ‌రం భూనిర్వాసితుల కోసం ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారు జ‌న‌సేనాని. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు స‌రైన ప‌రిష్కారం లేదు. పున‌రావాసం క‌ల్పించ‌డం లేదు. పోల‌వ‌రం మ‌ట్టి డంపింగ్‌ను కొంద‌రు రైతులు వ్య‌తిరేకిస్తున్నారు. వీట‌న్నిటిపై ప్ర‌భుత్వ పెద్ద‌లెవ‌రూ స‌రైన స‌మాధానం చెప్ప‌డం లేదు. ఇల్లు, భూములు కోల్పోతున్న ప్ర‌జ‌ల‌కు స‌రైన పున‌రావాసం క‌ల్పించ‌డం లేదు. దీంతో ఉద్దండ‌రాయ పాలెం, మూల లంక రైతులు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్‌ని క‌లిశారు. అంద‌రికీ ప‌వ‌న్ హామీ ఇచ్చారు. స‌మ‌స్య‌పై పోరాడ‌తాన‌ని మాటిచ్చారు. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే మంత్రుల‌తో మాట్లాడుతా. స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే క్షేత్ర స్థాయిలో పోరాడుతాను.. అంటూ ప‌వ‌న్ ఉద్య‌మ సెగ రేపేరు. నిర్వాసితుల‌కు స‌రైన పున‌రావాసం క‌ల్పించ‌క‌పోతే మ‌రో తీవ్ర‌స్థాయి పోరాటం సాగుతుంద‌ని ప‌వ‌న్ మాట‌ల్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వాలు స్పందించ‌క‌పోతే మూల‌లంక‌లో ప‌ర్యటిస్తాన‌ని ప‌వ‌న్ అన‌డాన్ని బ‌ట్టి స‌మ‌స్య సీరియ‌స్‌నెస్‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సమ‌స్య ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వాల స‌మ‌స్య‌లేంటో త‌న‌కు తెలీదని తాను ప్ర‌జ‌ల త‌ర‌పున నిలుస్తాన‌ని ప‌వ‌న్ అన‌డంతో ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంలో గుబులు మొద‌లైంది.