ప్రజల్లోకి వెళతాం.. తెలంగాణ కోసం ప్రత్యేక ప్రణాళిక: పవన్ కళ్యాణ్

Wednesday, May 2nd, 2018, 11:15:45 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తన నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశారు. గత కొంత కాలంగా పోటీ విషయంలో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాల్లో కేవలం 100 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ ఆ రూమర్స్ కి రీసెంట్ జరిగిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా తమ పార్టీ ఎన్నికల బరిలో పోటీలో ఉంటుందని చెప్పారు. త్వరలోనే తెలంగాణ ఎన్నికలకు సంబందించిన ప్రణాళికలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు పవన్ చెప్పారు.

అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ముందుకు వెళతామని చెబుతూ.. ప్రజల మధ్యలోకి వెళ్లే విధంగా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నెల 11న పర్యటనలకు సంబందించిన వివరాలను తెలియజేస్తామని, ప్రకటించిన 48 గంటల అనంతరం తాను ప్రజల్లో ఉండనున్నట్లు పవన తన నిర్ణయాన్ని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments