అజ్ఞాతవాసి టార్గెట్..హైదరాబాద్ మెట్రో, అమరావతి రాజధాని..!

Sunday, December 3rd, 2017, 11:25:46 PM IST

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న అజ్ఞాతవాసి చిత్రం దాదాపుగా పూర్తయిపోయింది. ఇక మిగిలింది ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే. చిత్ర విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పై దర్శకుడు త్రివిక్రమ్ దృష్టి పెట్టాడు. భారీ ఎత్తున, విన్నూత్నంగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రోజుల్లో సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం కోసం ఏకంగా ఫ్లైట్ బ్రాండింగ్ ని తీసుకుని వచ్చారు. కబాలి పోస్టర్ లు విమానాలపై సైతం పడ్డాయి. అదే తరహా ప్రచారం అజ్ఞాతవాసి చిత్ర టీం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం చిత్ర టీం స్పైస్ జెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ నుంచి వైజాగ్, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే రెండు విమానాలపై అజ్ఞాతవాసి బ్రాండింగ్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఇటీవలే లాంచ్ అయిన హైదరాబాద్ మెట్రో పైకూడా అజ్ఞాతవాసి కన్ను పడ్డట్లు తెలుస్తోంది. 14 మెట్రో రైళ్లల్లో అజ్ఞాతవాసి చిత్రాన్ని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ చిత్ర ఆడియో వేడుకని అమరావతి రాజధానిలో ప్లాన్ చేస్తుండడం కొసమెరుపు.

  •  
  •  
  •  
  •  

Comments