వీడియో : జనసేనుడిని హత్తుకున్నా అభిమాని.. అంతా షాక్ !

Saturday, January 27th, 2018, 05:55:34 PM IST

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ సినిమాల పరంగా కాకుండా ఎక్కువగా తన వ్యక్తిగతంతోనే అభిమానులను సంపాదించుకున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక పవన్ స్టార్ కనిపిస్తే అభిమానులను ఆపడం కష్టమే అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ ఎక్కడ సభలు జరిపినా అభిమానులు ఆయనను కలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొందరైతే సెక్యూరిటీ ని దాటుకొని సడన్ గా పవన్ ని హద్దుకుంటున్నారు. అయితే పవన్ కూడా ఏమి అనకుండా వారిని కలుసుకుంటున్నాడు. ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన పవన్ సభలో మాట్లాడుతుండగా ఓ అభిమాని స్టేజ్ పైకి వచ్చి పవన్ ని హత్తుకున్నాడు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా అతను పవన్ ని విడువలేదు. పవన్ కూడా ఏమి అనకుండా అతనితో ఒక సెల్ఫీ దిగి హ్యాపీగా పంపించాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.