ఎల‌క్ష‌న్ ముందు ప‌వ‌న్ చిత్ర‌మిదే!

Friday, September 7th, 2018, 04:45:43 PM IST

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్నాడు. సారూప్య‌త ఉన్న‌వారిని క‌లుపుకుని వెళుతూ ఎలా ప‌ట్టు చిక్కించుకోవాలా? అన్న పంతంతో ఉన్నాడు. ప్ర‌త్య‌ర్థులైన తేదేపా, వైకాపా బ‌లంగా ఉండ‌డంతో త‌న‌వైపు నుంచి యుద్ధ స‌న్నాహ‌కం పెద్ద‌దిగా ఉండాల‌ని త‌ల‌చి చాలా ముందు నుంచే వార్‌లోకి దిగిపోయాడు. ఈ యుద్ధం పెనుయుద్ధంగా మార‌నుంద‌ని ప‌వ‌న్ ఎత్తుగ‌డ‌లు చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. త‌న‌ని టార్గెట్ చేస్తూ చంద్ర‌బాబు ఆడుతున్న ఆట‌ను చాలా ముందుగానే ప‌సిగ‌ట్టి ప‌వ‌న్ కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకెళ్లే ప్లాన్‌ని సిద్ధం చేసుకున్నాడు.

ముంద‌స్తు ఎన్నికలు అంటూ ఓవైపు గోల‌. ఆ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇంకా ఇంకా రాజ‌కీయాల్లో బిజీ అయిపోతాడ‌నుకుంటే ఉన్న‌ట్టుండి అత‌డు సినిమాల వైపు చూడ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ప‌వ‌న్ ఎన్నిక‌ల ముందే ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని తాజాగా మాట్లాడుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ సినిమాలు చేస్తాడ‌ని ప్ర‌చార‌మైనా, త‌న ప్ర‌ణాళిక‌లు అందుకు పూర్తి విరుద్ధంగా సాగాయి. రాజ‌కీయాల‌కే పూర్తిగా అంకిత‌మ‌య్యారు. అందుకే ఇప్పుడు సినిమా చేస్తాడు.. అన్న మాట వినిపించ‌గానే ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. అయితే ప‌వ‌న్ సినిమా చేస్తున్న మాట నిజ‌మే అయినా అది తాను న‌టించే సినిమా కాదు. నిర్మించే సినిమా అని తెలుస్తోంది. అది కూడా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ సోద‌రుడు వైష్ణవ్‌తేజ్‌ని టాలీవుడ్‌లో హీరోగా ప్ర‌మోట్ చేసేందుకు ఈ సినిమా చేస్తున్నాడ‌ట‌. అల్లుళ్లు అంటే ప‌వ‌న్‌కి ఎంత ఇష్ట‌మో తెలిసిందే. అందుకే ప‌వ‌న్ ఇలా ఇంత బిజీ షెడ్యూల్స్‌లోనూ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments