నేను మాత్రం మిమ్మల్ని మోసం చేయను – పవన్ కళ్యాణ్

Monday, May 21st, 2018, 10:01:01 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలకు పదునుబెట్టారు. ఇన్నాళ్లు అధికార టీడీపీ, బీజేపీలను నామ మాత్రంగానే విమర్శిస్తూ వచ్చిన ఆయన ఈసారి మాత్రం పదునైన ప్రసంగాలతో వాడీ వేడీ చూపించారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో జరిగిన ప్రజా యాత్రలో మాట్లాడిన ఆయన టీడీపీ ప్రభుత్వం హామీలను నిమబెట్టుకోలేకపోయిందని అన్నారు.

ఎన్నో సమస్యలు వేటాడుతున్న శ్రీకాకుళం జిల్లాను బాగుచేయడం కోసం సుమారు 600 హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిందన్న ఆయన వేటినీ సక్రమంగా నెరవేర్చలేదని, ఇది ఖచ్చితంగా మోసమేనని అన్నారు. ప్రధాని మోదీ కూడ సెంట్రల్ హాల్ కు మెట్లకు మొక్కినప్పుడు మనకు న్యాయం చేస్తారాని అనుకున్నానని, కానీ ఆయన కూడ మాట తప్పారని, వాళ్లందరిలాగా తాను మోసం చేసే వ్యక్తిని కాదని, తిట్టినా, కొట్టినా నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments