విష ప్రచారమా..ట్విట్టర్లో పవన్ ఇచ్చిన ఘాటు రిప్లై చూడండి.!

Friday, February 22nd, 2019, 03:57:49 PM IST

గత కొంతకాలం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తన పని తాను కానిచ్చుకుంటూ పోతున్నారు.అదే సందర్భంలో ఆ మధ్య అంతా పవన్ చేసిన ప్రజాపోరాట యాత్రలో ఇచ్చిన ప్రసంగాలు ఏపీ లోని రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి.ఆ తర్వాత పవన్ సైలెంట్ గా ఉండేసరికి అదిగో పవన్ ఈ పార్టీతో కలిసిపోతున్నారు,ఆ పార్టీతో కలిసిపోతున్నారన్న వార్తలు కోకొల్లలుగా వచ్చాయి.అవి మరీ శృతి మించడంతో పవన్ మళ్ళీ రంగంలోకి దిగాల్సొచ్చింది.

తాను వామపక్షాలతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పేసారు.కానీ పవన్ పై ఆ విష ప్రచారాలు ఇంకా ఆగలేదు సరికదా ఏకంగా ఒక పత్రికలో చంద్రబాబు పవన్ ముసుగులో వ్యవహారం నడిపిస్తున్నారని కథనం కూడా రాసేశారు.దీనితో పవన్ అభిమానులు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతుంటే పవన్ మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేసారు.

“టీడీపీ ఏమో వైసీపీ,బీజేపీలతో జనసేన కలిసి ఉంది,వైసీపీ ఏమో చంద్రబాబుతో కలిసి ఉందని అంటున్నారు,ఆ మధ్య తాను రాజ్ భావన్ లో కెసిఆర్ ను కలవగా మళ్ళీ టీడీపీ తాను తెరాస మరియు వైసీపీ లతో కలిసి ఉన్నానని అంటున్నారు.మీరు ప్రజల కోసం నిజంగా పనిచేసినప్పుడు,మరి మీరు అన్ని వైపుల నుండి సంగీతాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది”.అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా అన్ని పార్టీలకు చెంపపెట్టులాగా లాస్ట్ పంచ్ వేసేసారు.ఇప్పుడు ఈ ట్వీట్ చూసి అయినా పవన్ పై ఇలాంటి విష ప్రచారాలు ఆపుతారో లేదో చూడాలి.