ఫుల్ క్లారిటీతో పవన్.. గందరగోళంలో జగన్..!

Saturday, November 12th, 2016, 09:31:41 AM IST

Jagan-Pawankalyan
ఎప్పుడూ ఆవేశంతో ఉండే పొలిటికల్ గబ్బర్ సింగ్ ఇప్పుడు ఆలోచనలకు పదును పెట్టాడా..?ఆవేశం తగ్గించి రాజకీయ పరిణితి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడా..?రోజురోజుకు పవన్ కార్యాచరణలో క్లారిటీ పెరుగుతోందా..?అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి నిదర్శనం పవన్ అనంతపురం బహిరంగ సభలో చేసిన ప్రసంగమే అని రాజకీయ నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన ప్యాకేజ్ పై పవన్ పూర్తిగా అధ్యయనం చేసి ప్రజల ముందుకు వచ్చారు. కేంద్రం ఏపీకి రావలసిన దానికంటే ఏమి ఎక్కువగా ఇవ్వలేదని పవన్ తేల్చేసాడు.

ఇది ఒక ఎత్తైతే పవన్ తన విమర్శలలో కూడా పరిణితి కనబరిచాడు. తనకు ఏ పార్టీ తోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవని కేవలం సిద్ధాంత పరంగా మాత్రమే తాను వ్యతిరేకిస్తానని జగన్ పేరుని కూడా ప్రస్తావిచడం విశేషం.ఇక అనంతపురం లో కరువు గురించి మాట్లాడుతూ అనంతపురం లో కరువు లేదని ఉన్నదంతా భావదారిద్య్రమే అని పవన్ అన్నారు.సత్యసాయిబాబా లాంటి వ్యక్తులు కరువుని ఎదుర్కొనే చర్యలను సమర్థవతంగా చేసినపుడు ఒక వ్యవస్థగా ఉన్న ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేయలేదా అని నిలదీశారు. ఎక్కడా అనవసరమైన విమర్శలను పవన్ చేయలేదు.ఇక ఎపి ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రత్యేక హోదా పై పోరాడుతున్న ప్రత్యేక ప్యాకేజ్ లో కేంద్రం ప్రకటించిన వాటిని, ఏపీకి రావలసిన వాటిని గురించి ప్రజలకు జగన్ వివరించడం లో విఫలం చెందారు.పోలవరం పై కూడా పూర్తి అధ్యయనం చేసిన పవన్ ఎవరూ బయట పెట్టని లొసుగుని భయపెట్టారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన కేంద్రం కేవలం ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు మంజూరు చేయడం ఏంటని పవన్ ప్రశ్నించారు. ఇలా పవన్ ఫుల్ క్లారిటీ తో దూసుకుపోతుంటే జగన్ మాత్రం ప్రజాక్షేత్రం లో వెనకబడిపోయారని విశ్లేషకులు అంటున్నారు.