ప్రశ్నించే వాడికే ప్రశ్నలు..విద్యార్థులతో పవన్ ముఖాముఖీ..!

Friday, November 11th, 2016, 01:05:14 PM IST

pawan-kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస సభలతో దూసుకు పోతున్నారు. అనంతపురం లో రెండోరోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గుత్తి లోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పర్యటించారు.ఈ సందర్భంగా పవన్ విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడారు. విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు. రాయలసీమలోని కరువు ప్రాంతాలను పరిశీలించేందుకు పాదయాత్ర చేయాలని ఉందని పవన్ ఈ సందర్భంగా విద్యార్థులతో అన్నారు. తనకు కేవలం ఒక్క ఊరినో, జిల్లానో కాదని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దత్తత తీసుకోవాలని ఉందని జనసేనాని అన్నారు.

ఈ సందర్భంగా పవన్ విద్యార్థులు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.రిజర్వేషన్ ల పై మీ స్పందన ఏంటని ఓ విద్యార్థి ప్రశ్నించగా రిజర్వేషన్లు ఒకటి రేండు తరాలకు మాత్రమే పరిమితం చేయాలనీ అంబేత్కర్ చెప్పినట్లుగా పవన్ అన్నారు. ఇది సున్నితమైన సమస్య కాబట్టి రాబోవు రోజుల్లో దీనిపై స్పందిస్తానని పవన్ అన్నారు.దీనిపై తనకు స్పష్టమైన అభిప్రాయం ఉన్నా ఇప్పుడే స్పందిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పవన్ అన్నారు.పెద్ద నోట్ల రద్దు పై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు పవన్ ఈ విధంగా సమాధాం ఇచ్చారు.అవినీతి సొమ్ముని వెలికి తీయడానికి పెద్ద నోట్లను రద్దు చేయడం మంచి పని అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఫోటోల కోసం క్లిక్ చేయండి