విమానంలో ఇక మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు!

Wednesday, May 2nd, 2018, 12:50:34 PM IST

ఎక్కడికెళ్లినా మనవెంట ఏం ఉన్నా లేకపోయినా మొబైల్ ఉండడం సర్వ సాధారణం అయిపొయింది. టక్నాలిజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు. విహార యాత్రలకు వెళ్లినప్పుడు అలాగే ప్రయాణ సమయాల్లో మొబైల్స్ తో కాలాన్ని గడపకుండా ఉండలేము. అయితే విమాన ప్రయాణాల్లో మాత్రం మొబైల్స్ సైలెంట్ అయిపోతాయి. స్విచ్ హాఫ్ చేయాలనీ చెబుతారు. భద్రత, రక్షణ దృష్ట్యా కారణాల వల్ల చాలా కాలంగా ఈ రూల్ ప్రతి దేశంలో నడుస్తోంది.

అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి రూల్స్ కి చెక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్స్ మాట్లాడటం. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయట. శాటిలైట్ ద్వారా ఈ సేవలు అందనున్నాయట. టెలికం కమిషన్ ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటీ ద్వారా సేవలను మన భారత గగనతలంలో అందించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాయ్ ఆధ్వర్యంలో అంబుడ్స్ మెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో ప్రయాణికులకు విమాన ప్రయాణమంటే ఈ సారి ఎంత మాత్రం బోర్ కొట్టదని చెప్పవచ్చు. మరో మూడు నాలుగు నెలల్లో ఈ సదుపాయాలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం అందుతోంది. ఓడల్లో కూడా ఈ సదుపాయాలకు అనుమతి ఇచ్చారు.