జనసేన కటౌట్ అదిరింది..పవన్ అసలైన నిర్ణయాలు అక్కడే!

Friday, March 9th, 2018, 02:02:49 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలైన రాజకీయ ఆలోచన ఏమిటో ఈ నెల 14న తెలియనుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యాచరణ గురించికా వివరంగా తెలుపనున్నాడు. అందుకోసం జనసేన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. అందులో పార్టీ సిద్దాంతాలు కూడా ఉన్నాయి. కులాలను కలిపే ఆలోచన విధానం. మతాల ప్రస్తావన లేని రాజకీయం. భాషల్ని గౌరవించే సాంప్రదాయం. సంస్కృతులను కాపాడే సమాజం. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. అవినీతి లేని రాజిపోరాటం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని జనసేన ముఖ్య సిద్దతలుగా కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు సభలో ప్రత్యేక హోదా విషయం గురించి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనీ అనుకుంటుంది అనే విషయాన్ని కూడా పవన్ సభలో తెలుపనున్నారు.