పవన్ “జే ఎఫ్ సి” లోగో చూశారా?

Monday, February 12th, 2018, 06:24:17 PM IST

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో గత కొంత కాలంగా దేశంలో ప్రతి పక్షాలు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళనలను చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు అలాగే వైసిపి నేతలు ఏ స్థాయిలో నిరసనలను తెలిపినప్పటికీ ఏ మాత్రం లాభం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే కొంత మంది సామజిక వేత్తలతో రాజకీయాలతో సంబంధం లేకుండా జనసేన అధినేత పవన్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. జయప్రకాశ్ నారాయణ – ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడబోతోన్న ఆ కమిటీ లోగో ని పవన్ రిలీజ్ చేశాడు. జే ఎఫ్ సి(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) అనే ఈ గ్రూప్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం అబద్దం చెప్పింది అనే దానిపై రీసెర్చ్ చేయనుంది. కేంద్రప్రభుత్వం నిధులను చాలానే ఇచ్చినట్లు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఏం అందలేదు అనే వివరణ ఇస్తోంది. మరి ఈ విషయంలో జే.ఎఫ్.సి ఎలా వర్క్ చేస్తుందో చూడాలి.