ట్విట్టర్ ఖాతా తెరిచిన పవన్

Thursday, January 1st, 2015, 10:11:38 PM IST

pawankalyan-tweet
సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తన ఖాతాను ఓపెన్ చేశారు. పవన్ ఖాతాను తెరిచిన 2 నిమిషాలలోనే 25మంది ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు. ఇక ఇటీవల కొచ్చాడియన్ విడుదల తరువాత రజినీకాంత్ ట్విట్టర్ ఖాతాను తెరిచిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో ట్విట్టర్ లో తన ఖాతాను ప్రారంభించారు. తన అభిమానులకు మరింత చేరువ కావాలి అంటే తప్పకుండా తనకు ట్విట్టర్ లో ఖాతా ఉండాలని భావించిన పవన్ ట్విట్టర్ లో చేరిపోయారు.
పవన్ తన ఖాతాను తెరిచి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.