పవన్ కళ్యాణ్ వస్తుంటే సింహం వచ్చినట్టుంటుంది..!

Tuesday, September 25th, 2018, 12:31:12 AM IST

చాలా కాలం విరామం తర్వాత జనసేన అధినేత మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పట్ల పోరాటం చేయనున్నారు.అందులో భాగం గానే నిన్న ఏలూరులో రొట్టెల పండుగకు హాజరు అయ్యి రాష్ట్రం మరియు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని రొట్టెను వదిలారు.మరల ఈ రోజు నుంచి మళ్ళీ తన ప్రజాపోరాట యాత్రని తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.అందుకు గాను ఆయన ఈ రోజు ఏలూరు చేరుకోనున్నారు,దీనితో అక్కడి అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమం నిమిత్తం అక్కడికి జనసేన విభాగానికి చెందినటువంటి మహిళలు కూడా పాల్గొంటున్నారు,వారు మాట్లాడుతూ జనసేన యొక్క ప్రీ మానిఫెస్టోలో పెట్టిన పథకాలకు గాను మహిళల్లో అనూహ్యమైన స్పందన వస్తుంది అని,తెలిపారు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏలూరు వస్తున్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ వస్తున్నపుడు చూస్తే ఒక సింహం వస్తున్నట్టుగా ఉంటుందని, ఆయన సిద్థాంతాల కోసం వారు ఎల్లవేళలా పోరాడుతామని తెలిపారు,అంతే కాకుండా ఇంకొక మహిళామూర్తి మాట్లాడుతూ వారు పవన్ కళ్యాణ్ గారిని,సినీ తారగా కన్నా రాజకీయనాయకుని గానే ఎక్కువగా ఇష్టపడుతున్నాం అని దానికి కారణం వారు మాత్రమే ప్రజల పట్ల నిక్కచ్చిగా పోరాటం చేస్తున్నారు అని,జనసేనాని రాక కోసం తాను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాని తెలిపారు.