వీడియో : చిన్నారికి బాసటగా.. మరోసారి తన ప్రేమను చూపించిన పవన్!

Saturday, May 19th, 2018, 08:34:38 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరికొత్త అర్దాన్ని చెబుతూ ముందుకు సాగుతున్నాడు. ఓ చిన్నారి తనను కలవాలని ఆరాటపడుతోంది అని తెల్సుకున్న పవన్ వెంటనే వారిని పిలిపించి కలుసుకోవడం అందరిని ఎంతగానో ఆకర్షించింది. అయితే ఆ చిన్నారి క్షిణించిపోయే ఓ వ్యాధితో బాధపడుతోంది అని తెలుసుకున్న పవన్ పాప వైద్యానికి కావాల్సిన ఖర్చును భరించడానికి సిద్ధమయ్యారు. అలాగే ఒక బ్యాటరీ తో కలిగిన వీల్ చెయిర్ కూడా ఇప్పించేందుకు పవన్ అంగీకరించారు. ఆ విషయాన్ని పాప తల్లి స్వయంగా తెలిపారు. అంతే కాకుండా ఆర్థికంగా కూడా పాప కుటుంబానికి సహకారాన్ని అందించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా కొంత మంది చిన్నారుల కోసం పవన్ తన ఆర్థిక సహాయానికి అందించిన సంగతి తెలిసిందే. ఇక పవన్ ఆ చిన్నారిని ఎత్తుకొని ప్రేమగా దగ్గరికి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments