అభిమానిని పరామర్శించిన పవన్

Tuesday, January 6th, 2015, 10:34:35 PM IST

pawan-meet-fans
జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా విచ్చేసిన ఒక అభిమాని గొంతుపై గుర్తు తెలియని అగంతకుడు తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. అయితే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ అభిమాని కరుణ శ్రీనివాస్ ను వ్యక్తిగతంగా కలవనున్నట్లు పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక అన్నట్లుగానే శ్రీనివాస్ ను, అతని కుటుంబ సభ్యులను పవన్ మంగళవారం ఉదయం 11గంటలకు తన కార్యాలయంలో కలిశారు. అలాగే అతడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న పవన్, అతని భార్యా పిల్లలతో కూడా మాట్లాడి దాదాపు గంట సేపు శ్రీనివాస్ కుటుంబంతో గడిపారు. అనంతరం శ్రీనివాస్ వైద్యానికి అయిన ఖర్చుతో పాటు మరో యాభై వేల రూపాయల సహాయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అందచేశారు.