పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొండి..”పవర్ స్టార్” సినిమా ఖచ్చితంగా ఉంది.!

Friday, November 2nd, 2018, 12:52:52 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసారన్న సంగతి అందరికి తెలుసు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ప్రకటనను అంత తేలిగ్గా జీర్ణించుకోలేక పోయారు అన్నది కూడా వాస్తవం.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ నుంచి సినిమా ఉంటుంది అన్నది మాత్రం అసాధ్యం కానీ సినిమా ఉండదు అని చెప్పడం కూడా అసాధ్యమే అని పవన్ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న మైత్రి మూవీస్ వారు చెప్తున్నారు.

పవన్ రాజకీయాల్లో ఉండి కూడా సినిమాలు చేసుకోవచ్చు కదా అని అభిప్రాయపడే అభిమానులు కూడా చాలా మంది లేకపోలేరు.అయితే పవన్ ఇప్పుడు చేస్తారా లేక ఎప్పుడు చేస్తారా అన్నది పక్కన పెడితే పవన్ మాత్రం వారి నిర్మాణ సంస్థలో అయితే సినిమా చేస్తున్నారని వారు ఖచ్చితంగా చెప్తున్నారు.ఇటీవలే జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ముందే ఆయనకి వారు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు తెలిపారు.పవన్ కూడా వెనక్కి తన రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వలేదని తెలిపారు,సినిమా అయితే ఉందని కానీ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేము అని తెలిపారు.ఈ విషయం ఇప్పుడు పవన్ యొక్క అభిమానుల్లో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments