టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రమాదాలా..తీవ్రంగా కలచి వేసిందన్న పవన్ !

Sunday, January 22nd, 2017, 08:28:44 PM IST

pk-pawan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పై స్పందించారు.టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా ఇల్లాంటి ఘోర ప్రమాదాలు జరగడం బాధిస్తోందని పవన్ అన్నారు.ఈ సందర్భంగా ప్రమాదం లో మరణించిన వారికీ సంతాపం తెలిపారు.

ప్రమాదంలో 40 మంది మంది మృతి చెందడం బాధాకరమని పవన్ అన్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జనసేనాని కోరారు.మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. కాగా శనివారం అర్థ రాత్రి జరిగిన హీరఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం లో 40 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘోర ప్రమాదంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరో వైపు రైల్వే శాఖ ఈ ప్రమాదం వెనుక నక్సల్స్ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం లో 40 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు.

janasena1