సీఎం బాబు గారు మిమ్మల్ని ఎలా నమ్మడం.. : పవన్ కళ్యాణ్

Friday, April 20th, 2018, 11:59:55 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ‘ధర్మ పోరాట దీక్ష’ పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దీక్షను నిర్వహిస్తున్నారు. అయితే ఈ దీక్షలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పంపారట. ఈ విషయాన్ని పవన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కిమిడి కళా వెంకట్రావు గారి దగ్గరి నుంచి వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు. అందులో మీరు చేస్తున్న ‘ధర్మపోరాట దీక్ష’లో రాష్ట్రం మేలు కోసం నన్ను పాల్గొనాల్సిందిగా కోరారు. అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఏమీ ఆశించకుండా మీ తెలుగు దేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ..మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనక నుంచి మీడియా శక్తుల ద్వారా చంపేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం?’ అని ప్రశ్నించారు పవన్‌.

  •  
  •  
  •  
  •  

Comments