సమస్య ఒకే పవన్ కళ్యాణ్… వాటి పరిష్కారం సంగతి ఏంటి?

Sunday, September 24th, 2017, 09:38:56 PM IST

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా తమకు సమస్య అంటే వ ఎంతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్లి కలుస్తున్నారు. వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇలా ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నాడు. మీడియా ముఖంగా ప్రజలని, ప్రభుత్వాలకి సమస్యని పరిచయం చేస్తున్నాడు. ఆ సమస్య మీద స్పందిన్చాల్సిందిగా ప్రభుత్వాలని కోరుతున్నాడు. మొన్న విద్యార్ధుల సమస్య కాని, ఆక్వా ఫ్యాక్టరీ సమస్య గాని, ఉద్దానం కిడ్నీల సమస్య గాని, రైతుల భూముల సమస్య గాని, బోగాపురం విమానాశ్రయం గురించి గాని ఇలా ప్రజలందరు తమ సమస్యల పరిష్కారం కోసం పవన్ ఆశ్రయం పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వారి సమస్యలని ప్రభుత్వం ద్రుష్టికి తనదైన శైలిలో తీసుకెళ్ళాడు. ఇంత వరకు భాగానే ఉంది. ప్రజలందరు సమస్యలు విన్నవించుకోవడానికి పవన్ కళ్యాణ్ దగ్గరకి రావడం జనసేన ఏదో భరోసా ఇస్తుందని నమ్మకం. దానికి పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయమే.

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు సమస్యలు విన్నవించుకోవడానికి జనసేన అధినేత దగ్గరకు వస్తున్న ప్రజల సమస్యలు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయి అనేది చూస్తే కొన్ని మాత్రమె అనేది మిగిలిన రాజకీయ వర్గాల వాదన. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు అందరి ప్రజాప్రతినిధుల దగ్గరకి వెళ్తారు. అలాగే పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్తున్నారు. అయితే అందరు ఆ సమస్యని వారి పరిధి మేరకు మాట్లాడి, అధికారులతో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేస్తారు. కాని పవన్ కళ్యాణ్ దాని మీద కాస్తా మీడియా ఫోకస్ చేసేలా చేస్తున్నారు. అయితే మీడియా ఫోకస్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కావడం అసాధ్యం. దానికి క్రింది స్థాయి నుంచి సుదీర్ఘ పోరాటం ఉండాలి. లేదంటే అధికార పార్టీల మీద ఏదో ఒక రూపంలో ఒత్తిడి తీసుకురావాలి ఈ రెండు చర్యలు పవన్ కళ్యాణ్ చేయడం లేదు . కేవలం సమస్య ఫోకస్ అయ్యేలా చేసే వదిలేస్తున్నాడు అనేది చాలా మంది మాట. ప్రజలు ఎ విషయాలని ఎక్కువ కాలం గుర్తుంచుకోరు. అలాగే ఒక రోజు పవన్ మాట్లాడిన సమస్య గురించి ఆలోచించిన తరువాత మరిచిపోతారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఏదైనా కార్యాచరణ చేసి, దానిని మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వాలని అర్ధమయ్యేలా చెప్పడం ద్వారానే వాటి పరిష్కారం దొరికేది అని విశ్లేషకుల మాట. సమస్యల మీద స్పందించడం అనేది కొంత వరకు పవన్ కి ఉపకరించిన, భవిష్యత్తులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పవన్ కళ్యాణ్ ని కార్నర్ చేయడానికి మిగిలిన పార్టీలు ఈ సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ ని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ డ్రేజ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ చేయడం వలన ఎంత మంది జీవితాలు రోడ్డున పడిపోతాయో అనే విషయం ప్రస్తావించారు. ఆ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యల విన్నవించుకున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించి. లాభాల్లో ఉన్న సంస్థలని ఇలా ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వాలు ఆలోచించడం మంచి పద్ధతి కాదని అన్నారు. ప్రవేట్ కంపెనీలు వేల కోట్లు అప్పులు కట్టకుండా ఉంటె అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలబడి, ఇలా లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలని కూడా ప్రైవేట్ పరం చేయాలనుకోవడం శోచనీయం కాదని విమర్శించారు. రాష్ట్రంలో బలపడాలని అనుకుంటున్నా బీజేపీ పార్టీ భవిష్యత్తుకి ఇది అంత శ్రేయస్కరం కాదని కూడా చెప్పాడు, మరి ఈ సమస్య మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments