విప్లవ వీరుడికి జనసేనాని సెల్యూట్..!!

Saturday, November 26th, 2016, 05:02:33 PM IST

pawan-n
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లో విప్లవభావాలు ఉన్నాయని అందరూ అంటూంటారు.విప్లవకారుడు చే గువేరా ని పవన్ అమితంగా ఇష్టపడదానికి కారణం కూడా అదే. కాగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మరో విప్లవకారుడు ఫిడెల్ క్యాస్ట్రో నేడు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనాని ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు. చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రో లది విడదీయరాని బంధం.విప్లవ ఉద్యమాల్లో వారు చూపిన పోరాట పటిమ అద్భుతం.

క్యూబాని పాలించిన ఫిడెల్ అనేక విప్లవాత్మక మార్పులను తీసుకుని వచ్చారని, ముఖ్యంగా క్యూబా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఆయన విజయం సాధించారని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను గొప్పగా అభిమానించే చే గువేరా తో ఫిడెల్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఫిడెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప లీడర్ అని అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పవన్ అన్నారు. జనసేన పార్టీ ఆయనకు సెల్యూట్ చేస్తోందని పవన్ అన్నారు.