మీ ముందుకు వస్తున్నానంటున్న పవన్ – కొండగట్టు నుండి ప్రారంభం ?

Sunday, January 21st, 2018, 03:50:04 AM IST

మొత్తానికి పవన్ కళ్యా న్ తాజాగా కీలక ప్రకటన చేసారు. నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగు నేలపై ఉన్న పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మొదలు పెడుతున్నా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దాంతో పాటు ఆ దేవాలయానికి సంబందించిన ఫోటో కూడా పోస్ట్ చేసాడు . ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మరిన్ని వివరాలు తెలియచేస్తూ .. 2009 లో ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుండి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. దానికి తోడు మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం ఇక్కడ నుండే నా నిరంతర రాజకీయ యాత్రను అరబించేందుకు కారణం అయింది. సర్వ మత ప్రార్ధనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహనా చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నా, నా ప్రణాళికలు కొండగట్టులో ప్రకటిస్తాను అంటూ తెలిపాడు. సో రాజకీయ అరంగేట్రం కోసం సిద్దమైన పవన్ ఇకపై సినిమాలు చేస్తాడా ? లేదా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments