వీడియో : తన నిజ స్వరూపాన్ని మరోసారి చూపించిన పవన్!

Wednesday, January 24th, 2018, 05:38:48 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకన్నా తన వ్యక్తిత్వంతోనే పవన్ ఎక్కువ అభిమానులన అందుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో పవన్ ప్రజాయాత్ర తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ అభిమానులు మీటింగ్ లకు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే రీసెంట్ గా ఖమ్మం జిల్లాకి వెళ్లిన పవన్ అక్కడ ఒక మహిళను కలుసుకున్నారు. ఆమె గత కొన్నేళ్లుగా ఓల్డేజ్ హోమ్ ని నడుపుతున్నారు. అయితే ఆ మధ్యలో కొంచెం డబ్బు అవసరం ఉండి పవన్ దగ్గరికి వెళ్లిన ఆ మహిళను పవన్ ఆదుకున్నాడు. ఆ విషయాన్ని ఆమె మంచు లక్ష్మి మేము సైతం ప్రోగ్రాం లో వివరించారు. అయితే పవన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆమె కనిపించడంతో వెంటనే పిలిపించి హక్కున చేర్చుకున్నారు. ఈ తల్లి వల్లే నాకు మానవత్వ విలువ గురించి ఎక్కువగా తెలిసిందని పవన్ తెలిపాడు. అంతే కాకుండా పవన్ ఆమె పాదాలకు నమస్కారం కూడా చేశాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.