ప‌వ‌న్‌పై క‌మ్మ మీడియా స్టింగ్ ఆప‌రేష‌న్ ఆగిందేం?

Friday, October 5th, 2018, 04:00:31 AM IST

ఇటీవ‌లే జ‌ర్న‌లిస్ట్ మూర్తి కుల‌పిచ్చితో కూడుకున్న అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి అడ్డంగా బుక్క‌య్యాడు. టీవీ చానెల్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కుల‌పెద్ద‌ల‌తో మీటింగులు పెట్టి, పార్టీ ఫండ్ క‌లెక్ట్ చేశాడ‌ని స్టింగ్ ఆప‌రేష‌న్ చేసిన‌ట్టు గొప్ప‌ల‌కు పోతే ఉన్న ఉద్యోగం ఊడింది. అవ‌త‌లివారికి అన్యాయం చేయాల‌ని త‌ల‌పెడితే ఏం జ‌రుగుతుందో మూర్తి ఉదంతం ఎగ్జాంపుల్. ఉన్న‌దీ, లేనిదీ క‌ట్టుక‌థ‌లు అల్లి ఒక‌రిని బ‌లి కోరితే తానే బ‌లి పీఠం ఎక్కాల్సి ఉంటుంద‌ని రుజువైంది. అస‌లు విష‌య‌మే లేని దానిని ఏదో జ‌రిగిపోతోంద‌ని చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించాడు మూర్తి.

అందుకేనేమో.. దానిని గుర్తు చేస్తూ ప‌వ‌న్ జంగారెడ్డి గూడెం టూర్‌లో మూర్తికి కాలిపోయే చుర‌క ఒక‌టి వేశాడు. ప‌వ‌న్ తాజా టూర్‌లో.. ఓ పాప పార్టీ కోసం రూ.1350 విరాళంగా ఇవ్వబోయిందిట‌. అయితే త‌న‌ నుంచి రూ.11 కాయిన్స్ తీసుకొని, అంత డ‌బ్బు వద్దు తల్లీ అని చెప్పానని, కొందరు దానిని కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారని ప‌వ‌న్ అన్నారు. “పవన్ కళ్యాణ్ పసిపాప నుంచి రూ.11 దొంగిలించాడు“ అని స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారని సెటైర్ వేశారు. ఈ సెటైర్ కేవ‌లం మూర్తి లాంటి అవినీతి జ‌ర్న‌లిస్టుపైనే కాదు, ప‌వ‌న్‌కి వ్య‌తిరేకంగా ఉన్న‌ క‌మ్మ మీడియా మొత్తంపైనా ప‌వ‌న్ పంచ్‌ వేశార‌ని కాపు యువ‌త భావిస్తోంది. మీరే నా ఛానల్స్, నాకు మీడియా లేదు. మీరే వాట్సాప్‌లు, ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్‌ ద్వారా మీడియాగా మారండి అని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. చింతలపూడి, ఏలూరు, జంగారెడ్డి గూడెం త‌దిత‌ర చోట్ల ప‌ర్య‌ట‌న‌ల‌తో జ‌న‌సేనాని హోరెత్తిస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు జ‌నం నుంచి అంతే గొప్ప స్పంద‌న వ‌స్తోంది.