ఏపీలో మారుతున్న‌ సమీకరణాలు.. 2019 – నేనే ముఖ్య‌మంత్రి.. ఇక రాసుకోండ‌హే..!

Tuesday, November 6th, 2018, 12:59:40 PM IST

జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌ద‌ని.. వైసీపీ కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌ద‌ని.. ఎన్నిక‌ల నాటికి ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోతాయ‌ని.. దీంతో జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

2019 ఎన్నిక‌లు ఏపీకి చాలా కీల‌క‌మ‌ని.. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క‌మైన మార్పులు తీసుకొస్తాన‌ని.. అదికార టీడీపీని, ప్ర‌తిప‌క్ష వైసీపీని జ‌న‌సేన ఢీ కొట్ట‌నుంద‌ని.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు తెర‌పైకి వ‌స్తాయ‌ని.. దీంతో అధికారంలోకి జ‌న‌సేన వ‌స్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. 2014లో టీడీపీకి స‌పోర్ట్ చేయ‌డం అప్ప‌టి ధ‌ర్మ‌మ‌ని.. 2019లో టీడీపీని అధికారంలోకి రాకుండా చేయ‌డం ఇప్ప‌టి ధ‌ర్మ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. ఇక సీయం ప‌వ‌ర్ స్టార్.. అదొక తార‌క మంత్ర‌మ‌ని, 2019లో జ‌న‌సేన క‌చ్ఛితంగా అధికారంలోకి వస్తుంద‌ని.. నేనే ముఖ్య‌మంత్రిని అని రాసిపెట్టుకోండి అంటూ బ‌హిరంగ‌స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.