గంటా శ్రీనివాసరావు పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

Saturday, September 29th, 2018, 04:00:18 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలోని భాగంగా ఏలూరులో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే.చాలా రోజుల విరామం తీసుకొని యాత్ర కొనసాగించినా సరే స్పందన బాగానే వస్తుంది.అయితే ఈ రోజు ఏలూరు నుంచి భారీగా జనసేనలోకి చేరికలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను చాలా సుదీర్ఘమైన ఆలోచనతో,భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానని,కేవలం డబ్బు మాత్రమే ఉంటే ప్రజలకు ఎవరు నాయకుడు కాలేరని తెలిపారు.అదే సమయంలో టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసురావు గారి పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

తనకి తన పార్టీకి ఒక సుదీర్ఘమైన ఆలోచనా శక్తి, భాద్యత గల నాయకులు కావాలని,అందుకోసమే తాను రాజకీయంలోకి వచ్చానని,అంతే కానీ ఒక ఎన్నికల్లో ఒక పార్టీలో ఉండి మరో ఎన్నికల్లో వేరే పార్టీలోకి మారిపోయే నాయకులు తనకి అవసరం లేదని తెలిపారు.మాతో పక్కనే నిలబడి ఉన్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు తమ పార్టీని నడపలేమని చెప్పి,కాంగ్రెస్లో కలిపేసి వెళ్లిపోయారని,అలాంటి రాజకీయ నాయకులు మాత్రం తనకు అస్సలు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.