డబ్బు తీసుకోండి.. కానీ ఓటు జనసేనకు వేయండి: పవన్

Thursday, March 15th, 2018, 09:37:51 AM IST

ఎలక్షన్స్ లో గెలవాలంటే డబ్బు కొంతయినా ఉండాలని రాజకీయ నేతలు అనుకోవడం సాధారణమే. పోలీసులు – ఎలక్షన్ కమిషన్ ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా కూడా ఓటు బ్యాంకు ఫార్ములాలు నడుస్తూనే ఉంటాయి. డబ్బు తీసుకొని ఓట్లు వేయడం ఎప్పటి నుంచో భారత రాజకీయాల్లో నడుస్తోందనేది విశ్లేషకుల భావన. అయితే ఇప్పుడిపుడే రాజకీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్న పవన్ ఓటు బ్యాంకు తరహా విధాన్నాన్ని ఎలా మారుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సరైన రాజకీయ ఆలోచనతో గెలవాలని పవన్ ఆలోచిస్తున్నాడు. యువత పవన్ వైపు నిబడినా కూడా గ్రామాల్లో మహిళలు వృద్దులు నోటుకు ఆకర్షితులయితే కష్టమే. జనసేన లో కూడా ఆ ఆలోచన ఉంది.

అయితే పవన్ బుధవారం జరిపిన సభలో సరికొత్తగా తన వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. జనసేన దగ్గర ఎక్కువగా డబ్బు లేదు. సభలు జరుపుకోవడానికి ఇతరులు సహాయం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలలో అవతలి పార్టీ వారు ఓటు వేయమని రెండు వేల నుంచి ఐదు వేల వరకు డబ్బులు ఇస్తారు. అవి తీసుకోండి. మన అక్కా చెల్లెళ్ల పేరు మీద బ్యాంకులో వేయండి. కానీ ఓటు మాత్రం జనసేనకు వేయండి. డబ్బిలిచ్చేటప్పుడు మాకే ఓటు వేయండని దేవుడీపై ప్రమాణం చేయిస్తారు. పరవేలేదు ప్రమాణం చేయండి. ఎందుకంటే వాళ్లు చేస్తున్నది పెద్ద తప్పు. దేవుడు వాళ్లని క్షమించడు. కావాలంటే నేను దేవుడితో మాట్లాడతాను. ఇంట్లో ఉన్న కుటుంబ సబ్యలందరికి ఈ విషయాన్ని చెప్పండని జనసేన అధినేత వివరిస్తూ.. ఆగష్టు 14 – 15వ తేదీల్లో మ్యానిఫెస్టో ప్రకటించనున్నట్లు పవన్ తెలిపాడు. ఇక జనసేన సభ్యత్వం నమోదు చేసుకోవడానికి 93940 22222 నెంబర్ కి కాల్ చేసి మీకు ఇష్టమైతే వివరాలు ఇవ్వచ్చని పవన్ తెలిపారు.