టీడీపీకి ప్రశాంతంగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్..!

Tuesday, September 25th, 2018, 03:42:33 PM IST

జనసేన అధినేత ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఈ రోజు ఏలూరు చేరుకున్న సంగతి తెలిసినదే.అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వానికి కాస్త నిశ్శబ్దంగానే వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ కార్యకర్తలు,ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారుల పట్ల,బడుగు బలహీన వర్గాలి వారి పట్ల మరియు మహిళల పట్ల వారు చేసే ఆగడాల నిమిత్తం తీవ్రంగా మండిపడ్డారు.ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేందుకు తాను వారికి మద్దతు ఇవ్వలేదని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న చర్యలు ఏమి బాలేవని ఇవి చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,మరి అవి బాబు గారికి తెలిసాయో లేక తెలిసినా తేలినట్టు ఉంటున్నారా అని ప్రశ్నించారు.అదే సందర్భంలో మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు చేస్తున్న తప్పుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.గత కొద్ది నెలలుగా ప్రజల పట్ల ప్రభాకర్ గారి దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని,రోజురోజుకి అతను ఒక రౌడీషీటర్ లా తయారవుతున్నారని,ఇప్పటికే 37 కేసులున్నాయని,ఒకవైపు దళితులకు అండగా ఉంటామని చెప్తూ ఒక పక్క దళితులను ఇంటికి పిలిపించి మరీ కులం పేరుతో దూషించి మరీ కొడుతున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు చాలా సహనంగా అడుగుతున్నామని,మరొక్కసారి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నామని,తమ పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ గారిని క్రమశిక్షణలో పెట్టుకోవాలని సూచించారు.లేకపోతే పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తాయని హెచ్చరించారు.ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీసు శాఖ వారు కానీ చర్యలు తీసుకోనట్టయితే క్షేత్రస్థాయిలో పరిణామాలు ఉంటాయని చాలా సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు.