“జనసేన – బహుజన” పార్టీల పొత్తు తేలిగ్గా తీస్కుంటున్నారా..?

Friday, March 15th, 2019, 06:51:33 PM IST

గత కొన్ని రోజుల క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ అక్కడున్న ఇతర పార్టీలకు జనసేనను తొక్కేయ్యడానికి చంపెయ్యడానికి ఎలాంటి వ్యూహమైనా వేసుకోండి..దాన్ని తలదన్నే వ్యూహం వెయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నాది జనసేన పార్టీయే కాదని గుంటూరు సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.ఇప్పుడు తమ పార్టీ అధినేత అదే చేస్తున్నారని పవన్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే నిన్న రాజమండ్రి సభ ముగియడంతోనే ఈ రోజు రాజకీయ శ్రేణులకు దిమ్మతిరిగే షాకిచ్చారు.

తాను వామపక్షాలతో మాత్రమే కాకుండా కేంద్ర స్థాయి రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన “బహుజన సమాజ్ పార్టీ” అధ్యక్షురాలు మాయావతితో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడమే కాకుండా ఆమెను ప్రధానమంత్రి స్థానంలో కూడా చూడాలనుకుంటున్నానని అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.అదే సందర్భంలో రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నామని తెలిపారు.అయితే ఈ బహుజన పార్టీ అనేది తెలంగాణలో పక్కన పెడితే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా అన్న అనుమానం చాలా మందికే వచ్చి ఉంటుంది.

కానీ మన దగ్గర గడిచిన ఎన్నికల్లో ఈ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిస్తే తప్పక షాక్ కి గురవుతారు.గత ఎన్నికల్లో ఈ పార్టీకి అక్షరాలా 4,58,762 ఓట్లు పడ్డాయి.అలాగే సిపిఐ,సిపిఎం పార్టీలకి కలిపి 6 లక్షల పై చిలుకు ఓట్లు పడగా మొత్తం ఈ మూడు పార్టీల ఓట్లు కలిపితే 10 లక్షలు దాటేసాయి.అప్పటి నుంచి ఇప్పటికి ఈ సంఖ్య పెరిగేందుకు కూడా అవకాశం ఉంది,దీనితో రానున్న ఎన్నికల్లో పవన్ కొట్టే దెబ్బ గట్టిగానే ఉండనుంది అని జనసేన శ్రేణులు అంటున్నారు.అందుచేత ఇక్కడ కూడా బీఎస్పీ పార్టీని లైట్ తీసుకుంటే ఇతర పార్టీలకి ఎంతోకొంత నష్టమే..