పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్స్ చూస్తే ఎవరికైనా రక్తం ఉప్పొంగుతుంది

Tuesday, January 24th, 2017, 11:52:56 AM IST

pk-poster
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ మంగళవారం ఒక ఆల్బమ్ ను విడుదల చేయనుంది. అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఈ ఆల్బమ్ ను రూపొందించింది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు సంబందించిన పోస్టర్లను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

మన తరాలు సుఖంగా బ్రతకాలని మన ముందు తరాలు చేసిన త్యాగాలను పవన్ కళ్యాణ్ మరొకసారి గుర్తు చేశారు. వారి త్యాగాలతోనే మనం ఈ రోజు ఇంత సుఖంగా బ్రతుకుతున్నామని పవన్ ట్వీట్ చేశారు. ‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో.. అది నీ శరీర క్షేత్రంలో చల్ల లేకపోతె..అది నీ గుండెల్లో ఆత్మగౌరవం రగిలించకపోతే నీవు బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే.. ఎంత ద్రోహివిగా మారావు ఆ పవిత్ర రక్తానికి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.

పవన్ మరొక ట్వీట్ కూడా చేశారు. ‘మేము పూల గుత్తులు వ్రేలాడే వసంత ఋతువులం కాదు.. వట్టి మనుష్యులం! దేశం మాకు గాయలిచ్చినా మేము నీకు పువ్వులిస్తున్నాం. ఓ ఆశ చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా యోచించు ఏమి తెస్తావో మా కోసం. ఓటు అనే బోటు మీద ఒక సంద్రం దాటావు’ అని ఆయన ట్వీట్ చేశారు.