యూఎస్ లో మాటమాటకు తూటాలు పేల్చిన జనసేనాని..!

Sunday, February 12th, 2017, 03:48:12 AM IST


జనసేన అధినేత అమెరికా పర్యటన కొనసాగుతోంది. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగబోయో ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి పవన్ అతిథి గా పాల్గొననున్నారు. న్యూ హాంప్ షైర్ లో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన ప్రసంగంతో పవన్ అభిమానులను ఉత్సాహపరిచారు. ఉద్వేగంగా తాను రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్యాన్ని వివరించిన పవన్ ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది. తనకు దెబ్బలు తినడం దెబ్బలు కొట్టడం తెలుసని పవన్ అన్నారు. సినిమాలు చేస్తున్నప్పుడు తానెప్పుడూ సంతృప్తిగా భావించలేదని, కానీ ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించినపుడు నిజమైన సంతృప్తి కలిగిందని పవన్ అన్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు తనకు బెదిరింపులు వచ్చాయని, అయినా తనకు భయం లేదని తన జాగ్రత్తలో తాను ఉన్నానని పవన్ అన్నారు.పవన్ తన ప్రసంగం మధ్యలో ఎర్ర కండువాని తన మేడలో వేసుకున్నారు. ఈ టవల్ గబ్బర్ సింగ్ కు సింబల్ కాదని సామాన్యుడి సింబల్ అని అన్నారు. దీనికి కులం మతం ఉండదని అన్నారు. జానీ చిత్రం విజయం సాధించి ఉంటె సినిమాలు వదిలేసేవాడినని పవన్ అన్నారు. సినిమాలు చేయడం ద్వారా ఇమేజ్, డబ్బు వస్తాయని అన్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ ని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగిస్తానని అన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయాల్సి ఉందని మీనుంచి సహకారం కావాలని పవన్ అన్నారు.

ఫోటోల కోసం క్లిక్ చేయండి