పోటీ చేయబోయే జిల్లా పవన్ కు చాలా స్పెషల్!

Thursday, September 28th, 2017, 05:40:17 PM IST


జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరి కొద్దీ రోజుల్లో ఏపీ రాజకీయాల్ని వేడెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తానని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా అన్నీ సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తొలిసారి జనసేన పార్టీని బరిలో నిలపడానికి పవన్ కళ్యాణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో రెండు బలమైన పార్టీల మధ్య కొత్తగా పోటీచేయబోయే పవన్ పార్టీ ఈ మేరకు విజయం సాధిస్తుందనేది ఇప్పటికైతే పెద్ద ప్రశ్నగానే ఉంది. ఈ విషయాన్ని గుత్తెరిగిన పవన్ గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే విషయంపై వ్యూహాలు రచిస్తున్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. జనసేన పార్టీ సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటోంది. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం నుంచి వచ్చిన ఓ పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్ నెటిజన్లని ఆకర్షిస్తోంది.

ఈ వ్యాఖ్యలో అనంతపురం జిల్లా ప్రస్తావన రావడం విశేషం. కొందరికి భూదాహం ఉంటుంది. ఎన్నివేల ఎకరాలు సంపాదించినా సరిపోదు. నాకు ఇంకో దాహం ఉంది. అనంతపూర్ మొత్తం, సీమాంధ్ర మొత్తం సమస్యలని పరిష్కరించాలని ఉంది అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్య నెటిజన్లని ఆకర్షిస్తోంది. తాను అనంతపురం జిల్లా నుంచి బరిలోకి దిగుతానని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏమైనా అనంతపురం పేరుని ప్రత్యేకంగా మెన్షన్ చేసారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments