బీజేపీతో జత కట్టేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్? వాస్తవం ఇదే!

Tuesday, September 26th, 2017, 08:49:05 AM IST


ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చాలా కీలకంగా మారిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓ వైపు తన ఆలోచనలో భాగంగా ప్రజలకి చేరువ అవుతూ ప్రజా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరో వైపు రాజకీయ సమీకరణాలు చేసుకుంటూ రానున్న ఎన్నికలకి ఎలా సిద్ధం కావాలి అనే ఆలచన చేస్తున్నాడు. ఇదే సమయంలో తన దగ్గరకు వస్తున్నా ప్రజల సమస్యలపై మాట్లాడుతూ వాటి మీద మీడియా ద్రుష్టి పెట్టేలా చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ తాజాగా ఓ సమావేశంలో అర్ధం కాని విధంగా ఓ మాట ప్రస్తావించాడు. అది బీజేపీ పార్టీ గురించి.

అసలు విషయం ఏంటంటే. మాటల సందర్భంలో బీజేపీ పార్టీ గురించి ప్రస్తావించిన పవన్ కళ్యాణ్. ఏపీలో బీజేపీ పార్టీ బలపడాలని ప్రయత్నిస్తుంది. వారి ఆలోచన మంచిదే. అయితే అది జరగాలంటే ఆ పార్టీ ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందనే విషయం వారు గుర్తుంచుకోవాలి. ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కచ్చితంగా ప్రజలు నమ్మకం పొందుతారు. ఇప్పుడు ప్రత్యెక హోదా విషయంలో గాని విశాఖ రైల్వే జోన్ విషయంలో బీజేపీ పార్టీ ఎంత నిబద్ధతతో ఉంది అనే విషయం ప్రజలకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. అలాగే డ్రేజ్జింగ్ కార్పోరేషన్ ని ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్నారు. ఇక్కడ ఎక్కువగా లాభాలు తెచ్చిపెడుతున్న సంస్థని ప్రైవేట్ వారికీ అప్పగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎం చెప్పాలనుకుంటుంది. అలాగే ఏపీలో ఎలా తన బలం పెంచుకోగాలను అనుకుంటుంది అనే విషయం అర్ధం చేసుకోవాలని చెప్పాడు.

ఇప్పుడు ఈ మాటలని కాస్తా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ బీజేపీని విమర్శించకుండా. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడాలంటే ఉన్న అవకాశాలు ఏంటి అనే విషయం చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయా. అందరు అనుకుంటున్నట్లు మోడీకి ఏపీలో ఉన్న బలమైన సపోర్ట్ పవన్ కళ్యాణ అనే అనుమానాలు కలుగుతున్నాయి. జనసేన పార్టీతో తన బలం పెంచుకోవాల్సిన వ్యక్తి, వేరొక పార్టీ బలపడటానికి సలహాలు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాల మీద ఇప్పుడు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. మరి దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుంది అనేది కాలమే చెబుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments