టీడీపీ ఎమ్మెల్యేలకు లేని పౌరుషం నాకు ఉంది కాబట్టే అలా మాట్లాడా..పవన్

Tuesday, October 9th, 2018, 04:00:56 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి టీడీపీ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడ్డారు.ఈ రోజు సాయంత్రం కొయ్యలగూడెం లోని ప్రజా పోరాట యాత్రలోని భాగంగా నిర్వహించిన సభలో అత్యంత ఆవేశపూరితంగా మాట్లాడారు.ఇటీవలే చింతమనేని ప్రభాకర్ పై పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి జవహర్ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.పవన్ మోడీ చేతిలో కీలు బొమ్మ అని వారు ఎలా ఆడిస్తే అలా పవన్ ఆడుతున్నారని మండిపడ్డారు.

ఈ రోజు సభలో జవహర్ గారికి సమాధానమిస్తూ మీ పార్టీలోని నేతలు ప్రజలు పోలీసు అధికారులు,వృద్ధులు, మహిళా అధికారుల పట్ల అమానుషంగా ప్రవర్తించి,కులాల పేరుతో దూషించి కొట్టినప్పుడు ప్రశ్నించడానికి ఒక్కడు కూడా రాడు కానీ పవన్ కళ్యాణ్ వారి మీద మాట్లాడితే మాత్రం తనని తిడుతున్నారని అన్నారు.ప్రజలను ఇబ్బంది పెట్టినపుడు మీరు మాట్లాడరేమో కానీ నేను మాత్రం మాట్లాడుతానని తెలిపారు.మీకు ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించడానికి పౌరుషం లేదేమో నాకు మాత్రం ఉందని,అందుకనే ఆ రోజు అంత గట్టిగా మాట్లాడానని తెలిపారు.