పల్లె బాట పట్టబోతున్న పవన్..జనసేనాని కీలక నిర్ణయం..!

Sunday, October 29th, 2017, 09:34:53 AM IST

జనసేన పార్టీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయాలని అన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీ నిర్మాణంలో దీనిని మరో పెద్ద అడుగుగా భావించవచ్చు. వీలైనంత త్వరగా జిల్లా కేంద్రాలలలో పార్టీ ఆఫీస్ లని ఏర్పాటు చేయడానికి పార్టీ లోని ఇద్దరు కీలక వ్యక్తులకు పవన్ కళ్యాణ్ భాద్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో మాత్రం భారీ పార్టీ ఆఫీస్ ని ఐదు ఎకరాలలో నిర్మించనున్నారు.

మిగిలిన జిల్లా కేంద్రాలలో రెండు ఎకరాల విస్తీరణంలో కార్యాలయాలని ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందించేలా పవన్ పార్టీ నేతలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాలు కేవలం పరిపాలనా భావనాలుగా మాత్రమే ఉండేవి. వాటిని విజ్ఞానకేంద్రాలుగా కూడా డెవలప్ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఏపీలోని 13 జిల్లాలో ఆఫీస్ ల నిర్మాణం జరుగుతుంది. కాగా తెలంగాణాలో పాత జిల్లా కేంద్రాలలో ప్రస్తుతానికి ఆఫీస్ ల నిర్మాణం చేపట్టి ఆ తరువాత నూతన జిల్లాలో కూడా వాటిని విస్తరించనున్నారు. మేధావులు, విజ్ఞాన వంతులు చర్చలు జరపడానికి వీలుగా పార్టీ ఆఫీస్ ల నిర్మాణం చేపట్టాలనేది ఆహ్వానం ఆలోచన.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా గ్రామాల ప్రజల అభిప్రాయాలూ పవన్ తెలుసుకోవడం, పవన్ అభిప్రాయాలు పల్లెటూరిలోని ప్రజల వరకు చేరడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వారందిరిని అనుసంధానించేందుకు వీలుగా వీలైనంత త్వరలో జిల్లా కేంద్రాలలో పార్టీ ఆఫిస్ లని ఏర్పాటు చేయనున్నారు.