టాప్ గేర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. డోసు పెంచిన జ‌న‌సేన‌..!

Monday, February 11th, 2019, 09:45:02 AM IST


గ‌త ఎన్నిక‌ల్లో సిద్ధంగా లేమ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా పోటీ చేస్తామ‌ని తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిపిందే. త‌ను చెప్పిన‌ట్టుగానే రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అభ్య‌ర్థులని ఒక్కొక్క‌రిగా దించేస్తున్నారు ప‌వ‌న్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దూరంగా వున్న ప‌వ‌న్ లోక్ స‌భ్య ఎన్నిక‌ల్లో మాత్రం జ‌న‌సైనికుల‌ని పోటీకి దింప‌డానికి స‌ర్వం సిద్ధం చేస్తున్నారు.

ఇటీవ‌ల ఖ‌మ్మం, సికింద్రాబాద్‌, మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల్లో పోటీకిదిగ‌బోతున్నామ‌ని, ఆ నియోజ‌క వ‌ర్గాల‌కు సంబంధించిన పార్ల‌మెంట‌రీ క‌మిటీని ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా మ‌రో నాలుగు నియోజ‌క వ‌ర్గాల‌కు సంబంధించి క్లారిటీ ఇవ్డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న‌ల్గొండ‌, మెద‌క్‌, భువ‌న‌గిరి, వ‌రంగ‌ల్ నియోజ‌న వ‌ర్గాలకు సంబంధించిన పార్ల‌మెంట‌రీ క‌మిటీను తాజాగా ప్ర‌క‌టించారు. తెలంగాణ‌, ఆంధ్రాలో జ‌న‌సేన పార్టీ వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోనూ జ‌న‌సేన‌కు వామ‌ప‌క్షాలు మ‌ద్ద‌తుగా నిలువ‌బోతున్నాయి. ఇప్ప‌టికే ఇరు పార్టీల మ‌ధ్య ఒప్పందం కూడా కుదిరింది. జాతీయ నాయ‌కుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ విష‌యంలో గ‌తంలోనే పూర్తి స్ప‌ష్ట‌త‌ను వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ప్ర‌క‌టించిన మూడు స్థానాలు, తాజాగా ప్ర‌క‌టించిన నాలుగు స్థానాల‌తో తెలంగాణ‌లో ఇప్ప‌టికి జ‌న‌సేన 7 లోక్‌స‌భ స్థానాల‌ను ప్ర‌క‌టించింది. రానున్న రోజుల్లో మ‌రిన్ని స్థానాల‌ను ప్ర‌క‌టిస్తుందా? ల‌ఏక వీటితోనే స‌రిపెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుందా? అనేది తెలియాలి.