నేను ఓట్ల కోసం ఇక్క‌డికి రాలేదు.. తేల్చి చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Thursday, October 18th, 2018, 01:00:27 PM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పర్య‌టించిన సంగ‌తితెలిసిందే. తిత్లీ తుఫాను దెబ్బ‌కి ఉత్త‌రాంధ్ర అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండురోజులుగా శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ అక్క‌డ తుఫాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌ధ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇక్క‌డికి తాను ఎలాంటి రాజ‌కీయ ఉద్ధేశంతో రాలేద‌ని.. ఓట్ల కోసం అంత‌క‌న్నా రాలేద‌ని.. తిత్లీ తుఫాను బాధితుల‌కు స‌హాయం చేయ‌డానికి మాత్ర‌మే వ‌చ్చాన‌ని ప‌వ‌న్ అన్నారు.

ఇక తిత్లీ తుఫాన్ దెబ్బ‌కి ఉత్త‌రాంధ్రా మొత్తం తీవ్రంగా దెబ్బ‌తింద‌ని.. అయితే కేంద్ర‌ప్ర‌భుత్వం ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. కేంద్రం మొద‌టి నుండి ఏపీ పై చిన్న చూపు చూపిస్తోంద‌ని.. గ‌తంలో కేర‌ళ‌లో వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ఇక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంద‌రూ తుఫాను బాధితుల‌కు స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చి వారికి అండ‌గా నిల‌బ‌డాల‌ని ప‌వ‌న్ కోరారు. ఇక తిత్లీ తుఫాను బాధితుల‌ను ఆదుకోవాల‌ని.. తాను కేంద్ర‌ప్ర‌భుత్వానికి లేఖ రాస్తాన‌ని ప‌వ‌న్ తెలియ‌జేశారు. పారిశ్రామిక వేత్త‌లు, ఎన్నారైలు శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో టీడీపీ, వైసీపీలు రాజ‌కీయాలు చేయ‌కుండా త‌మ‌వంతుగా స‌హాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాలని ప‌వ‌న్ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments