బ్రాండ్ అంబాసిడర్ ఏం చేస్తాడో..మంగళగిరికి జనసేనాని..!

Sunday, February 19th, 2017, 03:09:26 PM IST


ఏపీలోని సమస్యలపై ఒక్కొక్కటిగా స్పందిస్తూ ప్రజకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకునేలా ఆయన డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిమాండ్ లకు పలు సందర్భాల్లో తెలుగు దేశం ప్రభుత్వం కదలి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ సమస్యలు పై స్పందించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలపై కూడా తన గళం వినిపించనున్నారు. దీనికోసం జనసేనాని రేపు మంగళగిరి బయలు దేరి వెళ్లనున్నారు.

గుంటూరులోని మంగళగిరిలో చేనేత కార్మిక సంఘాలు చేపడుతునం సత్యాగ్రహ దీక్షకు పవన్ మద్దత్తు ప్రకటించనున్నారు. పవన్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది.ఈ కార్యక్రమం లో పవన్ ప్రసంగించబోయే సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఇటీవల చేనేత కార్మికులు పవన్ కళ్యాణ్ ని కలసిన సందర్భంలో తాను చేనేత కార్మికులకోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.