మోడీతో పవన్ భేటీ..మధ్యలో అది ఉండదా..?

Sunday, January 28th, 2018, 11:15:13 PM IST

జనసేన అధినేత పవన్, ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయ్యే అపురూప ఘట్టం ఎప్పుడు అని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ రైతులతో జరిగిన సమావేసంలో రాయల సీమ సమస్యలని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళతానని అన్నారు. ప్రత్యేక హోదా వ్యాఖ్యలో బిజెపి పై నిప్పులు చెరిగిన పవన్ మోడీని కలిసే అవకాశం ఉందా అనే అనుమానాలు గతంలో తలెత్తాయి. ఇక పవన్ – బిజెపి మద్య శాశ్వతంగా అఘాతం ఏర్పడినట్లే అనే ప్రచారం కూడా జరిగింది. అందరిలాగే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ రాయలసీమ కరువు అంశాన్ని హైలైట్ చేస్తున్నారు.

ప్రత్యేక హోదా తాలూకు ఉద్యమం ఏపీలో ఇంకా పూర్తిగా సమసిపోలేదు. విపక్ష నాథ జగన్ ఇటీవల మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించి స్పెషల్ స్టేటస్ అంశాన్ని లైవ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో పవన్ కనుక ప్రధానితో భేటీ అయితే ప్రత్యేక హోదా గురించి సపరేటుగా ప్రస్తావించాలని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. పవన్ ప్రత్యేక హోదా గురించి మోడీతో మాట్లాడుతారా లేక రాయలసీమ కరువుతోనే సరిపెడుతారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.